రిపోర్టర్ తిరుపతి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
24-08-2026 12:50 AM
అమనగల్లు, ఆగస్టు 23(విజయక్రాంతి): కడ్తల్ మండల రిపోర్టర్ తిరుపతి గౌడ్ తండ్రి వల్లభూదాస్ పెంటయ్య ఇటీవల మృతి పట్ల కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం అకుతోటపల్లిలోని వారి నివాసానికి చేరుకున్న ఆయన, పెంటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పెంటయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో మండల బీ అర్ ఎస్ అధ్యక్షుడు అర్జున్ రావు, సర్పంచ్ శ్రీను, బీ అర్ ఎస్ నాయకులు లాలయ్య తో పాటు పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని బాధితులకు తమ సానుభూతిని తెలిపారు.






