ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు
24-08-2026 | 12:50am
సుల్తానాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో నవగ్రహ శివ పంచాయతన సహిత భక్త ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు విజయ రమణారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓబుల పూజ, రాజేందర్, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






