calender_icon.png 17 July, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీబీసీ ఉద్యోగి మృతికీ కారకులెవరు..?

17-07-2025 12:05:28 AM

మేడ్చల్ అర్బన్: మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధి డబీల్ పూర్  లోని  భారత్ బైబిల్ కాలేజీలో  కే. నర్సింగా రావు అనే ఉద్యోగి మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదే కాలేజీకి చెందిన అడ్మిన్ మేనేజర్ భాస్కర ములకల కోరారు. డైరెక్టర్ జాబ్ రెడ్డి, బిబిసి డీన్ కెన్నీ దామర,  ఎల్స దామెర, డి.ఎస్.పి ప్రసాద్ మరికొందరి సహకారంతొ గత సంవత్సరం నుంచి మానసికంగా వేధించి, ఉద్యోగం నుండి అర్ధాంతరంగా తొలగించి, జీతం అలవెన్సులు ఇవ్వకుండా భౌతిక దాడులకు పాల్పడినారని వారు ఆరోపించారు.

30 ఏళ్ళకు పైగా బారత్ బైబిల్ కాలేజ్ లో పనిచేసి కేవలం రూ.300ల జీతానికి చేరి నమ్మకంగా సంస్థ అభివృద్దికి కృషిచేసిన కె. నర్సారావు బుధవారం ఉదయం తీవ్ర మానసిక వేదనకు గురై  గుండెపోటుతో మరణించారని ఆయన బంధువు భాస్కర్ మొలకల చెప్పారు. మేడ్చల్ పోలీసులకు నరసరావు మృతిపై ఫిర్యాదు చేశామని భాస్కర్ మలకల మీడియాకు చెప్పారు. మేడ్చెల్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతికి కారుకులైన వారిని దర్యాప్తు చేసి గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నట్లు భారత్ బైబిల్ కాలేజ్ అడ్మిన్ మేనేజర్ పేర్కొన్నారు.