17-07-2025 12:03:37 AM
ప్రతి గురువారం ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో ప్రత్యేక సమీక్ష
ప్రతి సోమవారం బిల్లుల చెల్లింపులు
గడువులోగా ఇళ్ళను పూర్తి చేసేందుకు పూర్తి కసరత్తులు
రంగారెడ్డి, జులై 16: రాష్ట్ర ప్రభుత్వం ని రుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందు కు ఇందిరమ్మ పథకానికి శ్రీకారం చుట్టింది గత అసెంబ్లీ ఎన్నికల ఆమెని నెరవేడ్చేందు కు పల్లే పట్నం తేడా లేకుండా అర్హులకు ఈ పథకం అందేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది పథకం పకడ్బందీగా అమలు చేసేం దుకు ప్రత్యేకంగా రాష్ట్ర జిల్లా మండల స్థా యిలో ప్రత్యేక అధికారులను నియమించి వారికి బాధ్యతలను అప్పగించింది.
లబ్ధిదారుల ఎంపికను మొదలుకొని వాళ్లను ఇంటి నిర్మాణాలు పూర్తిచేసేలా సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ఇండ్ల నిర్మా ణంలో క్షేత్రస్థాయిలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది రంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం ఇండ్లకుటాయింపులో అధిక ప్రాధాన్యత ఇచ్చింది జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా ఎల్బీనగర్ షేర్ లింగంపల్లి అర్బన్ నియోజకవర్గం జి హెచ్‌ఎంసి పరిధిలో కాగా రాజేంద్రనగర్ మహేశ్వరం ఇబ్రహీంపట్నం కల్వకుర్తి 4 మండలాలు ఆమనగల్ కర్తల మాడుగుల తలకొండపల్లి షాద్నగర్ చేవెళ్ల నియోజకవర్గం అర్బన్ నియోజకవర్గాలుగా ఉన్నాయి.
దీంతో ఆయా నియోజకవర్గాల్లో నిరుపేదల ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇళ్ల మం జూరుకు కొంచెం ప్రాధాన్యత ఇచ్చింది అ యితే ఇలా మంజూరు తోనే ఆగిపోకుండా సంబంధిత అధికారులు లబ్ధిదారులకు మం జూరైన ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించడంతోపాటు వాటిని గ్రౌండింగ్ చేయించడంలో ప్రస్తుతం రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా టాప్ పేస్ లో దూసుకుపోతుంది.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృ ష్టి సారించింది. ప్రతినిత్యం జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలా నిర్మాణాల డెవలప్మెంట్ పై సమీక్షలు జరుగుతూ గ్రౌం డ్ వివరాలను డాటా సేకరిస్తూ వారికి లక్ష్యాలను నిర్దేశిస్తుంది.
టెన్త్ జిల్లా కలెక్టర్ నారా యణరెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు తో పాటు క్షేత్రస్థాయిలో నిర్మాణాలపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు జిల్లా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రతి గురువారం 15 మున్సిపాలి టీలు మూడు కార్పొరేషన్లలో ఇండ్ల మం జూరు క్షేత్రస్థాయిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మంజూరైన నిర్మాణాలకు బిల్లుల చె ల్లింపు సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష జరిపి వివరాలను సేకరిస్తున్నారు.
ఆయా మండలాలు, నియోజకవర్గ కేంద్రా ల్లో ప్రత్యేక అధికారులను నిరంతరం మానిటరింగ్ చేస్తూ వారికి పలు సలహాలు సూచ నలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలను సకాలంలో గుర్తించి వాటిని పరిష్కరించడంలో పనులు వేగం పుంజుకున్నాయి అయితే ఇండ్ల గ్రౌండ్ వివరాలను న మోదు చేయడంలో కొంత ఇంజనీర్ల కొరత ఉన్న కానీ దానిని అధిగమిస్తూ గృహ నిర్మా ణ శాఖ పిడి సంప్లా నాయక్ కలెక్టర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఇండ్ల ని ర్మాణాలను స్పీడ్ అప్ చేస్తున్నారు.
ఇండ్ల మంజూరు విషయంలో ఏమైనా లబ్ధిదారు ల వివరాలు తప్పులు దొర్లిన మండల స్థా యి జిల్లా స్థాయిలో సమస్యలను పరిష్కరిం చి లబ్ధిదారులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలను పరిష్కరిస్తున్నారు.
40 టన్నుల ఉచిత ఇసుక
ఇండ్ల నిర్మాణాల్లో ఇసుకకొరుతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. స్థానికంగా ఉండే వాగుల్లో ఇసుకను గు ర్తించి లబ్ధిదారులకు ఉచితంగా 40 టన్నుల ఉచితను సరిపడా చేసేందుకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల వారిగా లబ్ధిదారుల ఇండ్ల డెవలప్మెంట్ ను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారు. అక్కడికక్కడే ఆ ఇళ్ల కు సంబంధించిన ఫో టోలు తీసి ప్రత్యేక సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేసి వి వరాలను నమోదు చేస్తున్నారు.
ప్రతి సో మవారం ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి నాలుగు దశ లో బిల్లుల చెల్లింపు నేరుగా ల బ్ది దారుల ఖాతాలో అధికారులు జమ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1500 ఇళ్లకు బిల్లులు చెల్లించారు. ఇండ్ల మంజూరు మొదలుకొని బిల్లుల చెల్లింపులో అధికారులు ఎక్క డ అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అధికారులు విధులు నిర్వహిస్తున్నారని జిల్లా హౌసింగ్ పీడీ చంప్లా నాయక్ పేర్కొన్నారు.
అయితే పెరిగిన నిర్మాణ ధరలతో కొంత.... లబ్ధిదారులు ఇండ్లను నిర్మించేందుకు కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇందిర మ్మ ఇండ్ల మంజూరు కోసం లబ్ధిదారుల మ ధ్య తీవ్ర పోటీ నెలకొనగా ప్రస్తుతం మా ర్కెట్లో ఇండ్ల నిర్మాణాలకు సంబంధించిన ధరలు విపరీతంగా పెరగడంతో కొంత ఆర్థిక సమస్యలు కారణంగా కూడా లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి కొంత నిరాసక్తి కనబరుస్తున్నారు.
ఎవరైతే లబ్ధిదారులు ఇండ్ల నిర్మా ణాలు మొదలు పెట్టని వారి నుంచి అధికారులు స్వచ్ఛందంగా వారి నుంచి ఇష్టపూ రితంగా లేఖలను తీసుకొని అదే గ్రామంలో మరొక లబ్ధిదారునికి అట్టి ఇండ్లను కేటాయి స్తూ పనులను మొదలు అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీం తో రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల ని ర్మాణ విషయంలో మిగతా జిల్లాల కంటే ముందంజలో ఉంది.
17,440 ఇళ్ళు మంజూరు
జిహెచ్‌ఎంసి పరిధిలోని రెండు నియోజకవర్గాలను మినహాయించి మిగతా ఆరు నియోజకవర్గాల కు మొత్తం 17,440 ఇండ్ల ను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఇప్పటికీ 10,956 ఇండ్ల నిర్మాణాల పనులను ను లబ్ధిదారులు ప్రారంభించారు. ఇ ప్పటివరకు ఇండ్ల గ్రౌండింగ్ ను చూస్తే 3470 ఇండ్ల పునాదుల వరకు, 121 గోడల వరకు 51 స్లాబ్ వరకు, ప్రస్తుతం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.
శంషాబాద్ మండలంలో సుల్తాన్ పల్లి గ్రామానికి చెంది న చాకలి కళమ్మ అనే లబ్ధిదారు.... ఇప్పటికే తన కు మంజూరైన ఇల్లును పూర్తి చేయగా అధికారులు ఆమె ఖాతాల్లో నాలుగు విడతల కు సంబంధించిన ఐదు లక్షల బిల్లును ఆమె ఖాతాలో జమ చేశారు.