calender_icon.png 17 July, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్

17-07-2025 12:05:47 AM

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడి 

హైదరాబాద్, జులై 16 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుని దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన బెంగళూరులో బుధవారం జరిగిన ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను   సీఎం సిద్ధరామయ్య ఆవిష్కరించగా, తాను అప్పట్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీసీ డిక్లరేషన్‌ను ప్రతిపాదించానని తెలిపారు.

ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక తనకు టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం వచ్చిందని, సీఎం రేవంత్‌రెడ్డి అగ్రవర్ణ నాయకులు అయినా బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ సహకారాన్ని అందింంచారన్నారు. రిజర్వేషన్లు న్యాయ, చట్ట, రాజకీయపరంగా ఎక్కడ ఇబ్బందులు కాకుండా అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు.

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో బీసీ అంశాన్ని ప్రతి రోజు ప్రధానంగా ప్రస్తావించారని, అధికారంలోకి రాగానే రాహుల్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి బీసీ కమిషన్, బీసీ డెడికేషన్ కమిషన్, కులగణన, అసెంబ్లీలో బిల్లు, గవర్నర్‌కు ఆర్డినెన్సు ఇలా అన్నిరకాలుగా చర్యలు తీసుకున్నారని ఆయన వివరించారు.

ఇంతటి విప్లవాత్మక చారిత్రక ఘట్టంలో తనకు భాగస్వామ్యం లభించడం అదృష్టంగా సమావేశంలో తెలంగాణ నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీలు వి. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.