13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

కాగజ్ నగర్ మున్సిపాల్ చైర్మెన్, వైస్ ఛైర్మెన్ ఎన్నిక వాయిదా

16-02-2026 02:03 PM

కాగజ్ నగర్,(విజయ క్రాంతి): కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మెన్(Kagaznagar Municipal Chairman), వైస్ చైర్మెన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక పోవడంతో వాయిదా వాయిదా వేసినట్లు మున్సిపల్ అధికారులు ప్రకటించారు. మున్సిపల్ ఆఫీసుకు తెరాస కౌన్సిలరు 11, ఎంఐఎం 01, ఇండిపెండెంట్ లు 02 1 మొత్తం14 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. కాంగ్రెస్  09, బీజేపీ 05, స్వతంత్రులు 02 మొత్తం16 మంది కౌన్సిలర్లు గైరాజరయ్యారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో  మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం 16 మంది కౌన్సిలర్లు కోరం అవసరం. తెరాస, ఎంఐఎం, స్వతంత్రుల తో పాటు 14 మంది సంవత్సరాలు మాత్రమే ఉండటంతో కోరం లేక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు.

గురువారం తిరిగి నిర్వహించినట్లు అధికారులు వివరించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బంధం ఏర్పాటు చేశారు. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల కోసం పట్టణ వాసులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసినప్పటికీ కోరం లేక వారితో పడడంతో నిరుత్సాని గురయ్యారు. కాంగ్రెస్ , బిజెపి, ఇద్దరు స్వతంత్రుల మధ్య చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో సయోధ్య కుదరకపోవడంతోని ఆ పార్టీల కౌన్సిలర్లు గైరాజరైనట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. గురువారం వారి మధ్య సయోధ్య కుదిరితే జరగనుంది. లేనిపక్షంలో మరింత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎంఐఎం కౌన్సిలర్ టిఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేసినట్లు ఆ పార్టీకి చెందిన నాయకులు బుధవారం కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ ఎంఐఎం కౌన్సిలర్ తెరాస కౌన్సిలర్ల వెంట చైర్ పర్సన్ ఎన్నిక కు మున్సిపల్ కార్యాలయానికి హాజరయ్యారు.