calender_icon.png 12 January, 2026 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలభైరవస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

12-01-2026 01:12:49 AM

ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి:  ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 

కామారెడ్డి, జనవరి 11: రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో నూతనంగా నియమితులైన చైర్మన్  కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్  హాజరై, ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్  మాట్లాడుతూ.. నేను పుట్టింది, పెరిగింది ఈ శ్రీ కాలభైరవ స్వామి చెంతనే. పుట్టిన నేలకు సేవ చేసే అదృష్టం అందరికీ రాదు. ఆ అదృష్టం నాకు లభించింది.

నా చేతుల మీదుగా ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం జరగడం ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు. దక్షిణ కాశిగా పేరొందిన ఈ ఆలయ అభివృద్ధి కోసం తొలిసారిగా అసెంబ్లీలో గళం విప్పి మాట్లాడానని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి మన అందరి బాధ్యత అని, కమిటీ సభ్యులు నిత్యం ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, ఆలయ సంప్రదాయాలు, కట్టుబాట్లను కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన చైర్మన్కు  కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే మదన్ మోహన్  హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.