12-01-2026 01:12:21 AM
కొత్తపల్లి, జనవరి11 (విజయక్రాంతి): కరీంనగర్లోని భగత్నగర్ శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో మైత్రిగ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్రెడ్డి ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న కొత్త జయపాల్రెడ్డి సోదరుడు కొత్త విజయ్కుమార్రెడ్డి అయ్యప్పస్వామిని దర్శించుకుని..ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు వారిని ఆశీర్వదించి..తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వాములకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా పలువురు స్వాములు మాట్లాడుతూ..కొత్త జయపాల్రెడ్డి సామాజిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సైతం తనవంతు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. అయ్యప్పస్వాములు, హనుమాన్ దీక్షాపరులకు యేటా భిక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు.