calender_icon.png 12 January, 2026 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముగిసిన సప్తాహ మహోత్సవాలు

12-01-2026 01:13:46 AM

మంథని, రామగిరి, జనవరి11(విజయ క్రాంతి) : రామగిరి మండలంలోని సుందిళ్ల గ్రామంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం సప్తహ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 4న ప్రారంభమైన భజన సప్తహ మహోత్సవములు 11న స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్టణ పురవీలగుండా ఊరేగించారు. ఆలయంలో నిర్వహించిన గోపాల కాలువలు కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏడు రోజులపాటు నిరంతర నిత్య భజన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఏడు రోజులపాటు నిత్యాన్నదానం కార్యక్రమంలో వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రుద్రభట్ల జయంత్ మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితం కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శాస్త్రృత్తంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని తెలిపారు.