calender_icon.png 16 September, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిత్యవసర ధరలను నియంత్రించాలి

26-08-2024 02:53:06 PM

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులి కలవేన శంకర్

మంచిర్యాల,(విజయక్రాంతి): నిత్యవసర ధరలను నియంత్రించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ అన్నారు. ఆది వారం సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... హనుమకొండ జిల్లాలో జరిగినటువంటి రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, ఈనెల 27న రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుందన్నారు. నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ రెండవ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో పోటికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరడం జరిగింది. సెప్టెంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి మూడవసారి అధికారం లోకి వచ్చిన తర్వాత మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వారికి నచ్చినటువంటి రాష్ట్రాలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించకపోవడం ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమని వారు అన్నారు.

ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, జోగుల మల్లయ్య, ఖలీందర్ అలీఖాన్, లింగం రవి, మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిర్యాల రాజేశ్వరరావు, చాడా మహేందర్ రెడ్డి, దేవి పోచన్న, మొగిలి లక్ష్మణ్, అఫ్రోజ్ ఖాన్, కాదండి సాంబయ్య, సిపిఐ నాయకులు పూజారి రామన్న, ఎగుడ మొండి, పోతార్ల రాములు, జంగాపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.