13-11-2025 08:50:21 AM
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Rajiv Gandhi International Airport) గంజాయి పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ పోర్ట్ అధికారులు అనుమానిత వ్యక్తులను తనిఖీలు చేశారు రూ. 4 కోట్ల విలువైన 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని ఎయిర్ పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర అధికారులు గంజాయిని గుర్తించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారుల సోదాల్లో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు పట్టుబడ్డాయి. ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.71.71 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అబుదాబీ నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.