calender_icon.png 13 November, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ పేలుడు.. కారులో లభించిన డీఎన్‌ఏ ఉమర్ నబీదే

13-11-2025 09:31:56 AM

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు(Delhi blast) ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో మరో కీలకమైన విషయం బయటపడింది. ఎర్రకోట వద్ద పేలుడు జరిపిన డాక్టర్ ఉమర్ నబీ డీఎన్ఏ(Dr. Umar Nabi DNAనిర్ణారణ అయింది. ఉమర్ నబీ తల్లి డీఎన్ఏ(Umar Nabi's mother's DNA) నమూనాతో సరిపోలినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కారు స్టీరింగ్, యాక్సిలరేటర్ మధ్య ఇరుకున్న కాలు నుంచి డీఎన్ఏ సేకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.  సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో 12 మంది ప్రాణాలు కోల్పోయి, అనేక మంది గాయపడిన పేలుడులో పాల్గొన్న ఐ20 కారును డాక్టర్ ఉమర్ నబీ భట్ నడిపారు. అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో(Al-Falah University) అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఉమర్ తన హ్యుందాయ్ ఐ20 తో పాటు మరో వాహనం, ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కలిగి ఉన్నారని కనుగొన్న తర్వాత ఢిల్లీ పోలీసులు బుధవారం హెచ్చరిక జారీ చేశారు. పుల్వామాలోని కోయిల్ గ్రామానికి చెందిన ఉమర్, ఫరీదాబాద్‌లోని ధౌజ్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. 

నాలుగు నగరాల్లో ఇద్దరు చొప్పున పేలుళ్లకు కుట్ర: దర్యాప్తు సంస్థలు

4 ప్రాంతాల్లో వరస పేలుళ్లలో ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు బృందాలు వెల్లడించాయి. నాలుగు నగరాల్లో ఇద్దరు చొప్పున పేలుళ్లకు కుట్ర పన్నారని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ప్రతి గ్రూప్ నుంచి భారీగా ఐఈడీ తీసుకెళ్లాలని నిర్ణయించారని అధికారులు తెలిపారు. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం పేలుళ్లకు ఎనిమిది మంది అనుమానితులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.  భద్రతా కారణాల దృష్ట్యా లాక్ ఖిలా మెట్రో స్టేషన్(Lal Qila Metro Station Closed ) మూసివేశారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు లాల్ ఖిలా మెట్రో స్టేషన్ మూసివేయబడుతోందని అధికారులు పేర్కొన్నారు. లాల్ ఖిలా మెట్రో స్టేషన్ మినహా అన్ని స్టేషన్లు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు సూచించారు.

ఢిల్లీలో సంచరించిన ఉగ్రవాది, 50 చోట్ల సీసీటీవీలో చిక్కాడు

ఎర్రకోట పేలుడు వెనుక ఉన్న బాంబర్ మార్గాన్ని పోలీసులు మ్యాప్ చేశారు. డాక్టర్ ఉమర్ మొహమ్మద్, అలియాస్ డాక్టర్ ఉమర్ ఉన్-నబి సోమవారం సాయంత్రం పేలుడుకు ముందు ఢిల్లీ అంతటా ప్రయాణించారని, డజన్ల కొద్దీ సీసీటీవీ కెమెరాలు అతన్ని గుర్తించాయని వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్ నుండి పారిపోయిన తర్వాత అతను తీసుకున్న మార్గాన్ని మ్యాప్ చేయడానికి పోలీసులు విజువల్స్‌ రూపొందించారు. ఫరీదాబాద్ నుంచి పారిపోయి, మొదట హర్యానాలోని మేవాట్ మీదుగా ఫిరోజ్‌పూర్ ఝిర్కా చేరుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణించాడు. ఆ రాత్రి ధాబాలో గడిపి కారులోనే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి తిరిగి వచ్చాడు. సోమవారం ఉదయం 8:13 గంటలకు అతను బాదర్‌పూర్ టోల్ దాటుతున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది. ఢిల్లీలోని దాదాపు 50 ప్రదేశాలలో డాక్టర్ ఉమర్ సీసీటీవీలో చిక్కాడు. అతను ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నగరం చుట్టూ తిరిగాడని సూచిస్తుంది.

ఢిల్లీలో, అతను మొదట తూర్పు జిల్లాలో కనిపించాడు. తరువాత అతను సెంట్రల్ జిల్లాలోని రింగ్ రోడ్ వరకు, తరువాత ఉత్తర జిల్లాకు ప్రయాణించాడు. అతను భోజనం కోసం నార్త్ వెస్ట్ జిల్లాలోని అశోక్ విహార్‌లో ఆగాడు. ఆ తర్వాత అతను సెంట్రల్ జిల్లాలోని ఒక మసీదును సందర్శించాడని వర్గాలు సూచిస్తున్నాయి. డాక్టర్ ఉమర్ మధ్యాహ్నం 3:19 గంటలకు నార్త్ జిల్లాలోని ఎర్రకోట పార్కింగ్ స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీలో తిరుగుతున్నప్పుడు, ఆ వాహనం కన్నాట్ ప్లేస్, మయూర్ విహార్‌లలో కూడా కనిపించింది. తరువాత అతను దానిని చాందినీ చౌక్‌లోని సునేహ్రీ మసీదు పార్కింగ్ స్థలంలో పార్క్ చేశాడు. ఉదయం 6:30 గంటల వరకు కారు పార్కింగ్ లోనే ఉందని, ఉమర్ ఒక్క క్షణం కూడా కారును వదిలి వెళ్ళలేదని నివేదికలు సూచిస్తున్నాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సాయంత్రం 6:52 గంటల ప్రాంతంలో నెమ్మదిగా కదులుతున్న ట్రాఫిక్‌ లో కారు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.