13 May, 2026 | 2:01 AM

కేసీఆర్ కృషి ఫలితమే కాళేశ్వరం

03-09-2025 12:00 AM
  1. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర 
  2. డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి 

చేవెళ్ల, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి ఆరోపించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు మంగళవారం చేవెళ్ల లో బీజాపూర్ హైవేపై మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతాతప్పుల తడకగా ఉన్నదని విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన ఈ ప్రాజెక్టును ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రపన్నుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణకు వాటాగా రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించడానికి చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించి కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

  బీఆర్ ఎస్ సర్కారు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని,  కేసీఆర్ కాళేశ్వరం ద్వారా 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని స్పష్టం చేశారు.  ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్‌ఎస్ పార్టీ పై , కేసీఆర్ పై ఎన్ని కుట్రలు చేసిన ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో  పార్టీ నేతలు దేశమొల్ల ఆంజనేయులు, వనం లక్ష్మీకాంత రెడ్డి, షేరి రాజు, ఆరిఫ్, శ్రీధర్ రెడ్డి, గోనె కరుణాకర్ రెడ్డి, నరేందర్రెడ్డి, ఊరడి రాములు, కావాలి శేఖర్, శివ కుమార్ పాల్గొన్నారు.

మర్రిచెట్టు కూడలిలో నిరసన.. 

మణికొండ, సెప్టెంబర్ 2: ప్రతిపక్ష బీ ఆర్ ఎస్ ను రాజకీయంగా నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే న్యాయబద్ధత లేని పి.సి. ఘోష్ కమిషన్ నివేదికను తెరపైకి తెచ్చిందని బీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో స్థానిక మర్రిచెట్టు కూడలిలో బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

స్థానిక అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ సీనియర్ నాయకులు, యువజన విభాగం, మహిళా నేతలు, కార్యకర్తలు ఏకతాటిపై నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళం విప్పారు. పద్నాలుగేళ్ళ పోరాటంతో సాధించుకున్న తెలం గాణను పదేళ్ళ పాటు అభివృద్ధి పథంలో నడిపించిన చరిత్ర తమదని, ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పి.సి. ఘోష్ నివేదిక చెల్లదు.. చెల్లదు,‘ ‘ప్రతిపక్షంపై కుట్రలు నశించాలి,‘ ‘నీటి హక్కులను కాపాడుకుంటాం‘ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వ తీరును ఎండగడుతూ కూడలిలో తమ నిరసనను తెలిపారు. అనంతరం సీతారాం ధూళిపాళ మాట్లాడుతూ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, బీఆర్‌ఎస్ నాయకులపై బురద జల్లేందుకే ఘోష్ నివేదికను వాడుకుంటున్నారని ఆరోపించారు. దాని ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. ప్రభుత్వ పుట్లను ప్రజల మద్దతుతో తిప్పికొడతామని పేర్కొన్నారు.

కేసీఆర్ కృషి ఫలితమే కాళేశ్వరం

 మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి సెప్టెంబర్ 2 :  రైతుల కన్నీళ్లు తుడిచేందుకే  తెలంగాణ తొలి  ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భాగీరథ కృషి ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఆర్‌ఎస్ పార్టీ  నిరసన కార్యక్రమంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు  దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డితో  పాల్గొని నల్ల బ్యాడ్జ్ లు ధరించి రాస్తారోకోలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  బీడు భూముల్లో నీళ్లు పారించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దిన అపర భగీరదుడు కేసీఆర్ పై  సీబీఐ కేసులా..? సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో 60 ఏళ్లపాటు తెలంగాణ రైతులు, రైతు కూలీలు పడిన బాధలు వర్ణనాతీతమని  గుర్తుచేశారు. స్వరాష్ట్రం వచ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో చేసిన సంస్కరణలతో తెలంగాణ, దేశానికి అన్నపూర్ణగా నిలిచిందని తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం కోసం కేసీఆర్ రేయింబవాళ్లు శ్రమించారని, దీని వలన లక్షలాది రైతులకు నీరు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేసీఆర్ను బద్నాం చేయడానికి కుట్ర లు చేస్తున్నదని ఆరోపించారు.

కేసీఆ్ప కాంగ్రెస్ కక్కుతున్న విషాన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమ యంలో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జావిద్ ఖాన్, మహిళా అధ్యక్షురాలు నిర్మల, యూత్ అధ్యక్షులు పైళ్ల ప్రభాకర్ రెడ్డి, లగ్గాని సోమేశ్ గౌడ్, కళ్యాణి, బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుపై భజనలు.. నిరసన 

వికారాబాద్, సెప్టెంబర్- 2 (విజయక్రాంతి): కాలేశ్వరం ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన గోష్ కమిషన్ ఓ పనికిమాలిన కమిషన్ అంటూ వికారాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిరసిస్తూ మంగళవారం వికారాబాద్‌లో బి ఆర్ ఎస్ నాయకులు నల్ల చొక్కాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీ ఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ మేడిగడ్డ లోని ఏడవ బ్లాక్ లో పగుళ్లు రావడం వెనక పలు అనుమానాలు ఉన్నాయన్నారు. కెసిఆర్ పేరు స్థిరస్థాయిగా ఉండే ఇష్టం లేకనే రాష్ట్ర ప్రభుత్వం బాంబులు పెట్టి ఏడవ బ్లాక్ లోని పిల్లర్లను పేల్చివేసినట్లు తమకు అనుమానాలు ఉన్నట్లు ఆరోపించారు.   రీష్ రావును లక్ష్యంగా చేసుకొని కమిషన్ నివేదికను ఇచ్చినట్లు ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి రాయమన్నట్లు గాని ఘోష కమిషన్ 600 పేజీల నివేదికను రాసిందని ఆరోపించారు. కాలేశ్వరం పై వేసిన గోష్ కమిషను  పిసిసి కమిషన్ గా ఆయన ఆరోపించారు. కాలేశ్వరం నివేదికపై హరీష్ రావును మాట్లాడ నీయకపోవడం వెనకాల అని ప్రభుత్వం అసలు కుట్ర దాగి ఉన్నట్లు తెలిపారు.  ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఉన్న ప్రాజెక్టులను కూల్చడం దారుణమన్నారు.

సిబిఐ మోడీ జేబు సంస్థగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సిపిఐ కి ఎందుకు అప్పగించారో ప్రజలకు చెప్పాలన్నారు. ఈ సందర్భంగా బీ ఆర్‌ఎస్ నాయకులు భజనలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలపై పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ వికారాబాద్ పట్టణ అధ్యక్షులు కుమ్మరపల్లి గోపాల్, మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి   పాల్గొన్నారు.

కాంగ్రెస్ డైవర్షన్ డ్రామాలు..

తాండూరు, 2 ఆగస్టు, (విజయక్రాంతి) : 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు తెరలేపుతుందని వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ టిఆర్‌ఎస్ ఇంచార్జి శ్రీశైలం రెడ్డి అన్నారు .కాలేశ్వరం ప్రాజెక్టు పై కెసిఆర్ మరియు హరీష్ రావు తదితరులపై సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వడం పట్ల అంబేద్కర్ చౌక్ వద్ద టిఆర్‌ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన  వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీ ఘోష్ రిపోర్ట్ pcc రిపోర్ట్ గా మారిందని, సిబిఐ అంటే కాంగ్రెస్ బిజెపి ఎంక్వయిరీ గా తయారందని విమర్శించారు.అబద్ధాలకు కేర్‌ఆఫ్ అడ్రస్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్  బిజెపి పార్టీలు కలసి కాలేశ్వరం పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ  మాజీ ప్రజా ప్రతినిధులు విద్యార్థి, మహిళ, కార్మిక ,విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘట్‌కేసర్‌లో బీఆర్‌ఎస్ నాయకుల నిరసన

ఘట్ కేసర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి  ఆదేశానుసారం కాలేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు, కక్ష సాధింపు చర్యలకు నిరసనగా మంగళవారం ఘట్ కేసర్  పట్టణం లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బిఆర్‌ఎస్ మున్సిపల్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్  ఆధ్వర్యంలో ఘట్ కేసర్,  పోచాలం బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ రెడ్డి  డౌన్ డౌన్ అంటూ  నినాదాలు చేశారు.

ఈకార్యక్రమంలో ఘట్ కేసర్, పోచారం మున్సిపల్స్ మాజీ వైస్ చైర్మన్ లు పలుగుల మాధవ రెడ్డి,  రెడ్యా నాయక్, రైతు సొసైటీ మాజీ చైర్మన్ లు సార శ్రీనివాస్ గౌడ్, డొంకెని బిక్షపతి గౌడ్, రైతు సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు రమేష్, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, మాజీ కౌన్సిలర్లు షేక్ జహంగీర్, చందుపట్ల వెంకటరెడ్డి, బేతాళ నర్సింగ్ రావు, బండారి ఆంజనేయులుగౌడ్,  కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎల్సాని ఐలయ్య యాదవ్,  నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, ఎరుకల దుర్గరాజ్ గౌడ్, శివరాత్రి లింగస్వామి, కార్యకర్తలు. ఉద్యమకారులు అభిమానులు. తదితరులు పాల్గొన్నారు.