25-05-2025 12:33:01 AM
మంథని/మహదేవపూర్, మే 24 (విజయ క్రాంతి): సరస్వతీ పుష్కరాల్లో భక్తులు శివమెత్తారు. పుష్కరాల్లో 10వ రోజైన శనివారం భక్తులు భారీగా తరలిరావడంతో నదీ తీరప్రాం తంతోపాటు కాళేశ్వర ము క్తేశ్వర స్వామి ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. వారాంతం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎనిమిది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
భక్తులు ఉదయం నుంచే పుష్కర ఘాట్‌కు చేరుకొని నదీలో స్నానాలు ఆచరించి శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ప్రారం మైంది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కుటుంబసభ్యులతో నదీలో స్నానవాచరించి స్వామివారిని దర్శించుకుని అభి షేక పూజలు చేశారు.
శివ భక్తులైన (థర్డ్ జెండర్స్) ఎక్కువ మంది పాల్గొని పుష్కర స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కరే ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
భారీగా ట్రాఫిక్ జామ్
భక్తులు భారీగా పోటెత్తడంతో మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వర కు ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులు గా కురుస్తున్న వర్షంతో పార్కింగ్ స్థలంలో నీళ్లు చేరడంతో వాహనాలు నిలిపేందు కు స్థలం లేకపోవడంతో వాటిని ఎటు మళ్లించాలో తెలియక అధికారులు ముప్పుతిప్పలు పడ్డారు.
ప్రధాన రహదారిపైనే ప్రైవే ట్, ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో కొంతమంది ప్రయాణికులు కాలినడకన పుష్కర ఘాట్‌కు చేరుకున్నారు. కలెక్టర్, ఎస్పీ అందుబాటులో ఉన్న ఎడ్లబండ్లతోపాటు ఇతర వాహనాల్లో భక్తులను తరలించారు. సాయంత్రంవరకు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఘనంగా నవరత్న మాలా హారతి
సరస్వతీ ఘాట్ వద్ద సాయంత్రం నవరత్న మాలా హార తి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో అద్భుతంగా నిర్వహించారు. ఈ హారతిని కాశీ పూజారు లు సంప్రదాయబద్ధంగా నిర్వహించగా, కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక అతిథిగా పాల్గొ న్నారు. హారతి దీపాల వెలుగులు, పూజారు ల శంఖారావం ఘాట్ పరిసరాలను మారుమ్రోగించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.