calender_icon.png 25 May, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా

25-05-2025 12:25:32 AM

-విద్యుత్ మంత్రుల సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి  

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): తెలంగాణలో నాణ్యమైన, నిరం తరాయ విద్యుత్ సరఫరా జరుగుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలి పారు. శనివారం బెంగళూరులో కేంద్ర విద్యుత్ మంత్రుల ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రు ల సదస్సులో డిప్యూటీ సీఎం విద్యుత్ రంగ అభివృద్ధిపై  మాట్లాడారు.

విద్యు త్ రంగంలో తెలంగాణ పురోగతి, ప్రణాళికలను వివరించారు. ఎలక్ట్రిక్ వాహనా ల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధిపై తెలంగాణ ప్రత్యే క చర్యలు తీసుకుంటోందన్నారు. ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయాల్సిన అవసరాన్ని సదస్సులో చర్చించగా... తాము ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

రాష్ర్టంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థ అభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్రసార లైన్లు, ట్రాన్స్‌ఫర్మేషన్ సా మర్థ్యంలో గణనీయమైన విస్తరణపై ప్రణాళికలను వివరించారు. విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు, ఆర్థిక స్థితిని మెరుగుపరిచే వ్యూహాలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు.

సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించడం, విద్యుత్ రంగ ఆర్థిక సిరత్వాన్ని నిర్ధారించడంలో చర్య లు తీసు కోవడంపై దృష్టి పెట్టామన్నా రు. భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ ను తీర్చేందుకు తెలంగాణ చూపిస్తున్న ప్రొ యాక్టివ్ దృష్టి కోణాన్ని ప్రస్తావించారు. కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్, కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యస్సో నాయక్, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి కే.జే జార్జ్, తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.