calender_icon.png 25 May, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నేషనల్ హెరాల్డ్’పై మౌనమేల?

25-05-2025 12:35:13 AM

-రేవంత్‌రెడ్డి పాత్ర ఏంటో కాంగ్రెస్ పెద్దలు బయటపెట్టాలి 

-పదేళ్లు బీఆర్‌ఎస్ దోచుకుంది.. 

-కాంగ్రెస్‌కు పాలనచేతకావడంలేదు 

-బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపణలు 

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): నేషనల్ హెరాల్డ్ కేసు ఈడీ విచారణలో కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి పేరు కూడా ఉందని, నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం ఆ పార్టీ నేతల నుంచి డొనేషన్లు తీసుకున్న అంశంలో రేవంత్‌రెడ్డి పాత్ర ఉందని ఈడీ విచారణలో బయటపడ్డప్పటికీ..ఆయన ఎందుకు మౌ నంగా ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.

బీజే పీ రాష్ర్ట కార్యాలయంలో శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు..రేవంత్‌రెడ్డి సూచనల మేరకు కొంతమంది నాయకులు విరాళాలు ఇచ్చారని..ఇంకా మిగతా నేతలను కూడా విరాళాలు ఇవ్వమని రేవంత్‌రెడ్డి కోరినట్లు పత్రికల్లో పెద్దఎత్తున వార్తలు వచ్చాయన్నారు.

ఈ విషయంలో సీఎం ఎంతమంది నాయకుల దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశారనేది తేలాల్సి ఉందని అన్నారు. నీతివంతమైన మాటలు మాట్లాడే కాంగ్రెస్ పెద్ద నాయకులు నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్‌రెడ్డి పాత్ర గురించి బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం ఇటువంటి విషయాల్లో టాలెంట్ ఉన్న వ్యక్తి అని.. గతంలో కూడా ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ వ్యక్తి అని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో తెలంగాణలో కాళేశ్వరం స్కాం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో, రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి ఇప్పటివరకు బయటపెట్టలేదన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు బీఆర్‌ఎస్ దోచుకుందని, కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకావడం లేదని విమర్శించారు.

మీడియా కోసం కేటీఆర్, రేవంత్ విమర్శలు

కేటీఆర్ మీద రేవంత్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మీద కేటీఆర్ ఒకరినొకరు పత్రికల్లో కనపడేందుకు విమర్శలు చేసుకుంటున్నారని..కానీ అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదని డీకే అరుణ విమర్శించారు. అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్ అవినీతి బ యటపెడతామని రాహుల్‌గాంధీ చెప్పారని, కానీ ఇప్పటివరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ అవినీతి సొమ్ము ను బయటపెట్టేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఎందుకు కోరలేదని ప్రశ్నిం చారు.  రేవంత్‌రెడ్డికి పరిపాలించే అర్హతే లేదన్నారు. రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ లోనే కుంపట్లు ఎక్కువ య్యాయని..ఆయన కుర్చీ ఎప్పటివరకు ఉంటుం దో తెలియని అనిశ్చితి పరిస్థితి నెలకొందన్నారు.

రాష్ర్టంలో 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని..కానీ అందులో సగం కూడా సేకరించలేదని డీకే అరుణ ఆరోపించారు. సీఎం కుర్చీ కాపాడుకునే ప్రయత్నంలో రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. 

రాసింది.. లీక్ చేసింది వాళ్లే కదా..

‘కేసీఆర్‌కు కవిత రాసిన లేఖను ఎవరు లీక్ చేశారు.. ఎవరు బయటపెట్టారు..’ఈ ప్రశ్నలకు సమాధానం వాళ్లే చెప్పాలని డీకే అరుణ అన్నారు. ఒకవేళ ఎవరో సీక్రెట్‌గా రాశారంటే, అది బయటకు ఎలా వచ్చిందన్నారు.

ఆమె లేఖను తండ్రికి రాసిందా.. అయితే లీక్ చేసినది తండ్రేనా...లేక కవితనేనా...ఇంకెవరైనా ఉన్నరా అని ఆమె ప్రశ్నించారు. వాళ్ల కుటుంబ సభ్యులే ఆ లేఖను లీక్ చేశారని అనుమానం వ్యక్తమవు తోందన్నారు. లాభదాయకంగా ఉంటేనే ఇలా లీక్ చేసే అవకాశం ఉంటుందని..లేకపోతే ఎవరు లీక్ చేస్తారని అన్నారు.