24 April, 2026 | 2:43 AM

కాళేశ్వరం తీర్పుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు

24-04-2026 01:04 AM

నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి  

పటాన్ చెరు, ఏప్రిల్ 23 : కాళేశ్వరం తీర్పుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటిదని పటాన్చెరు నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్పై తెలంగాణ హైకోర్టు తాజా తీర్పును ఆయన స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే విధిస్తూ ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించడం ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కక్షసాధింపులకు గట్టి చెంపపెట్టుగా నిలిచిందని అన్నారు. ఆ నివేదిక నిజానిజాలను ప్రతిబింబించకుండా రాజకీయ ఉద్దేశాలతో రూపొందించబడిందని విమర్శించారు.

గత మూడు సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్పై చేసిన ఆరోపణలు న్యాయస్థానం ముందు బట్టబయలయ్యాయని, రైతులకు నీరు అందించాల్సిన ప్రభుత్వం ప్రాజెక్ట్ను నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురిచేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి సారించాలని, రైతు బంధు, రైతు భీమా పథకాలను సమర్థంగా కొనసాగించాలని ఆయన సూచించారు. అలాగే ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని, ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలాను బాల్రెడ్డి, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, కౌన్సిలర్లు నవీన్ కుమార్, సురేష్, సతీష్, రవీందర్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ యువ నాయకులు పృథ్వీరాజ్, మాణిక్ యాదవ్, బీఆర్‌ఎస్ సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ బూన్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ప్రకాశ్ చారి, జగన్నాథ్ రెడ్డి, గణేష్, మాజీ సర్పంచ్ ఖాదిర్ తదితరులు పాల్గొన్నారు.