24 April, 2026 | 2:35 AM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డికి కీలక పదవి

24-04-2026 01:03 AM

భిక్కనూర్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి):  ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల జోనల్ కన్వీనర్గా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిని నియమిస్తూ సంఘటన్ జాతీయ చైర్మన్ సునీల్ పవర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు.