4 May, 2026 | 12:48 AM

హైదరాబాద్‌కు చేరుకున్న బిర్లా ఓపస్ ఇంటరాక్టివ్ ఎక్స్‌పో

26-06-2024 12:05 AM

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఆదిత్య బిర్లా గ్రూప్ ‘బిర్లా ఓపస్’ పెయింట్ పరిశ్రమలో గణనీయమైన ముందడుగు వేసింది. 2300పైగా లేత రంగులతో కూడిన నీటి ఆధారిత పెయింట్‌లు, ఎనామిల్స్, వుడ్ ఫినిషింగ్‌లు, వాల్ పేపర్‌లతో సహా 145 ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. 1200 ఎస్‌కేయులను అందిస్తూ దేశంలోనే ప్రముఖ పెయింట్ బ్రాండ్‌లలో ఇది ఒకటిగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. బిర్లా ఓపస్ దేశవ్యాప్తంగా తన వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు 180కిపైగా పాంతాల్లో విస్తరించాలని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. ఈక్రమంలోనే బిర్లా ఓపస్ ఎక్స్‌పో ఈనెల 25న హైదరాబాద్‌కు చేరినట్లు తెలిపారు.