17 August, 2026 | 1:05 AM

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కు అందజేత

17-08-2026 12:26 AM

తాడ్వాయి,ఆగష్టు,16( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగో జి వాడి గ్రామంలో ఆదివారం లబ్ధిదారుల కు కల్యాణ లక్ష్మి చెక్కును కాంగ్రెస్ పార్టీ నా యకులు అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ శివాజీ  మాట్లాడుతూ... ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కును అందించినట్లు తెలిపారు.

గ్రామానికి చెందిన ముదాం అంజయ్య కుటుంబ సభ్యులకు చెక్కును అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కరామత్ అలీ, గ్రామ అధ్యక్షులు గంట బాలరాజు, నాయకులు భూమారావు ,చిన్న సాయిలు,కారామత్ అలీ, రవి,ప్రకాష్, బాల నర్సు, శేఖర్, ప్రవీణ్ జిపిఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.