కేసీఆర్ ఆలోచనే కల్యాణలక్ష్మి
20-06-2024 12:14 AM
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్19 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్ ఆలోచనతోనే పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వచ్చాయని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీ స్పష్టంచేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 66 మందికి చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెక్కులు మంజూరు అయినప్పటికీ ఎన్నికల కోడ్ ఉండటంతో పంపిణీ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.లక్ష నూట పదహార్లతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, వెంటనే హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్ రావు, అజయ్ కుమార్, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






