calender_icon.png 24 January, 2026 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో కామధేను లిమిటెడ్

23-01-2026 12:04:16 AM

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): రిటైల్ విభాగంలో బ్రాండెడ్ టీఎం టీ బార్ల తయారీ, విక్రయంలో భారతదేశంలో అగ్రగామిగా ఉన్న కామధేను లిమిటె డ్, తన బ్రాండెడ్ కలర్ కోటెడ్ షీట్లు అయిన ‘కామధేను కలర్ మ్యాక్స్ షీట్’ తయారీ సామర్థ్యాన్ని తెలంగాణలో రాబోయే ఒక సంవత్సరంలో 20 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది.   తెలంగాణలో కలర్ కోటెడ్ షీట్ల విక్రయాలను ప్రస్తుతం ఉన్న 2,500 మెట్రిక్ టన్నుల నుంచి 3,000 మెట్రిక్ టన్నులకు వచ్చే ఏడాది లోపు పెంచాలని కామధేను లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది.

కామధేను లిమిటెడ్ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ మాట్లాడుతూ కామధేను కలర్ కోటెడ్ షీట్లు ప్రస్తు తం ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టుల్లో విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాల వల్ల మా ఉత్పత్తులపై డిమాండ్ గణనీయం గా పెరిగింది. ఈ పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు మా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెం చేందుకు మేము కట్టుబడి ఉన్నామన్నారు.