11 March, 2026 | 7:37 PM

కుంభాభిషేకం – తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు

11-03-2026 04:04 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): అమీర్ పేటలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో కుంభాభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు. బుధవారం మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై పూజలలో పాల్గొన్నారు. అనంతరం విద్యా శంకర భారతి మహాస్వామి ఆధ్యాత్మిక బోధనలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలకించారు.

ఈ సందర్భంగా విద్యా శంకర భారతి స్వామి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట ఆలయ EO అంబుజ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కూతురు నర్సింహ, కట్టా బలరాం, వేణు గౌడ్, నారాయణ రాజు, వినోద్, బాసా లక్ష్మీ, లక్ష్మీ తదితరులు ఉన్నారు.