23-01-2026 12:00:00 AM
బంగారంపై రూ.2000, వెండిపై రూ.5000 వరకు తగ్గుదల
హైదరాబాద్, జనవరి 22(విజయక్రాంతి): పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు.. గురువారం తగ్గాయి. వారం రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం లభిం చింది. బుధవారం ఒక్కరోజే బంగారంపై రూ.7000, వెండిపై రూ.5000 వరకు పెరిగి, రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. కానీ గురువారం మాత్రం రెండింటి ధరలు దిగొచ్చాయి. తులం బంగారంపై రూ.2000, కి లో వెండిపై రూ.5000 వరకు తగ్గింది.
భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో గురువారం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,310కు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,450 కు దిగొచ్చాయి. ఇక వెండి ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. గురువారం బంగారం రూ.2000 తగ్గితే వెండి మాత్రం రూ.5000 తగ్గింది. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.3.25 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో మాత్రం కేజీ వెండి రూ.3,40,000కు చేరింది.