వాడి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మేజర్ వాడి గ్రామంలో గల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారని పాఠశాల ప్రిన్సిపల్ వరం రాజు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఏడవ తరగతి విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా పాత్ర వహించి మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించారు. స్వయం పరిపాలన దినోత్సవ వేడుకల్లో ప్రధానోపాధ్యాయులుగా కే. కార్తీక్, ఉపాధ్యాయులుగా సాయిచరణ్, అయాన్తి, కావ్య, అక్షిత, పీటీ దయాకర్గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరం రాజు మాట్లాడుతూ... స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహణ వలన విద్యార్థులలో బాధ్యత,నాయకత్వ లక్ష్యాలు మరియు స్వయ క్రమశిక్షణలు పెంపొందుతాయని గురువుల ప్రాముఖ్యతను అవగాహన ద్వారా తెలుసుకుంటారన్నారు. తదుపరి ఆరో తరగతి విద్యార్థులు ఏడో తరగతి విద్యార్థులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేందర్,ఉపసర్పంచ్ సునీత,గ్రామ కార్యదర్శి నరేష్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరం రాజు ఉపాధ్యాయులు శ్రీలత, వినోదం,మౌనిక,గంగారం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




