13-09-2025 02:58:11 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): కామారెడ్డిలో ఈనెల 15న కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలనుకున్న బీసీ డిక్లరేషన్ సభను వాయిదా వేసినట్టు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించారు. భారీ వర్షా లు కురిసే అవకాశం ఉన్న నేపథ్యం లో సభను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరి గి సభ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధ్దరామయ్యతోపాటు తదితరులు హాజరుకావాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేన్‌న్ల కోసం అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్‌కు పంపిన విష యం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేప ట్టి ఏడాదికావడంతో ఈ సభను నిర్వహించాలని నిర్ణయించారు.