calender_icon.png 13 September, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్సీపురంలో రూ.6.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

13-09-2025 02:59:26 AM

-హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, సెప్టెంబర్ 12 :ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ రామచంద్రాపురం డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముం దుకు తీసుకొని వెళుతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

రామచంద్రపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీలో రూ.3.20 కోట్లతో చేపట్టనున్న థీమ్ పార్క్ పనులకు, ఒక కోటి 7 లక్షల రూపాయలతో కాకతీయ నగర్ కా లనీలో యూజీడీలు, సిసి రోడ్ల నిర్మాణ పనులకు, రామచంద్రాపురం స్మశాన వాటికలో ఒక కోటి 98 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం స్థానిక కా ర్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ తో కలిసి ఆ యన శంకుస్థాపన చేశారు. ప్రజలందరికీ మె రుగైన పరిపాలన అందించడమే లక్ష్యంగా ప నిచేస్తున్నామని తెలిపారు.

కాలనీలలో ప్రభు త్వ స్థలాలు ఉన్నచోట్ల థీమ్ పార్కులు నిర్మి స్తూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణా న్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, రాజు, రాజే ష్, జి హెచ్‌ఎంసి ఈ సురేష్, డిఈ కృష్ణవేణి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.