18 April, 2026 | 11:43 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మలేషియాలో కామారెడ్డి వాసి మృతి

12-05-2024 02:55 AM

14 రోజులకు స్వగ్రామానికి మృతదేహం

కాంగ్రెస్ ఎన్నారై సెల్ జిల్లా అధ్యక్షుడి చొరవ

కామారెడ్డి, మే11 (విజయక్రాంతి): బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లిన ఓ వ్యక్తి వారం రోజులకే గుండెపోటుతో మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా ఎన్నారై సెల్ అధ్యక్షుడు చిట్టెడి సుధాకర్‌రెడ్డి చొరవతో౧౪ రోజుల తర్వాత అతని మృతదేహం స్వగ్రామానికి చేరుకున్నది. కామారెడ్డి మండలం కోటాల్‌పల్లికి చెందిన ఆకుల రమేశ్ (35) గత నెలలో మలేషియాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన వారంలోనే గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్థులు విషయాన్ని సుధాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, శనివారం మృతదేహం స్వగ్రామానికి చేరుకున్నది. మృతుడి కుటుంబ సభ్యులను సుధాకర్‌రెడ్డి పరామర్శించి, ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.