భక్తి, యాక్షన్, భావోద్వేగాల కనకదుర్గ
31-08-2026 12:00 AM
అల్లరి నరేశ్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భక్తి ప్రధాన చిత్రం ‘కనకదుర్గ’. ఈ చిత్రానికి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తుండగా, బీవీఎస్ రవి కథను అందిస్తున్నారు. బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రం జీ5 తెలుగు భారీ పోస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ లైనప్‌లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రత్యేకంగా జీ5 తెలుగులో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.
భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం.. ఇలా అన్ని అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ చిత్రం భక్తి భావాన్ని ఆవిష్కరిస్తూనే, నేటి ప్రేక్షకులకు ఆకట్టుకునే కథతో ఓ పవర్‌ఫుల్ సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.






