31 August, 2026 | 3:31 AM

టార్టాయిస్‌గా రాజ్‌తరుణ్

31-08-2026 12:00 AM

స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో ఎవరు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ సస్పెన్స్‌కు తెర దించుతూ మేకర్స్ ఆ యంగ్ హీరో ఎవరు?, సినిమా ఏంటి? అనేది మేకర్స్ తాజాగా ప్రకటించారు. స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో రాజ్‌తరుణ్, ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘టార్టాయిస్’ అంటూ అని ప్రకటించారు. మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోపాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు.

ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఒక డెడ్ బాడీ పక్కన హీరో రాజ్ తరుణ్ రక్తపు మరకలతో కూర్చుని ఉండటం, ఆయన పక్కనే ఒక కత్తి పడి ఉండటం ఆసక్తి రేపుతోంది.

రాజ్‌తరుణ్ ఈ సినిమాలో ఒక కొత్త తరహా ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: శబరి విఘ్నేశ్; సంగీతం: అనూప్ రూబెన్స్; యాక్షన్: బెమనొల శ్రీకాంత్; ఎడిటర్: గుళ్లపల్లి మాధవ్ కుమార్; ఆర్ట్: దేవర మధుకర్.