31 August, 2026 | 4:56 AM

కోటగుళ్లలో సంగారెడ్డి డిఎంహెచ్‌ఓ లలితాదేవి దంపతుల పూజలు

31-08-2026 01:33 AM

గణపురం,ఆగస్టు 30 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిని (డిఎంహెచ్ ఓ), ఆలయ పోషకులు డాక్టర్ లలితా దేవి, రాజేశ్వర ప్రసాద్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి శాస్త్రోక్తంగా  పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రావణమాసం ఆదివారం పర్వదినం సందర్భంగా డాక్టర్ దంపతులు శ్రీ భవాని సహిత గణపేశ్వరునికి పట్టు వస్త్రాలు, చీరె, సారె సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి అర్చకులు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.