7 June, 2026 | 1:24 AM

కాంచీపురం నారాయణి సిల్క్స్ షోరూమ్

07-06-2026 12:08 AM

గచ్చిబౌలిలో ఘనంగా ప్రారంభం

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): పట్టుచీరలకు, సంప్రదాయ చేనేత వస్త్రాలకు ఏకైక గమ్యస్థానంగా పేరొందిన ప్రముఖ బ్రాండ్ కాంచీపురం నారాయణి సిల్క్స్ కొత్త షోరూంను హైదరాబాద్ ఐటీ హబ్ గచ్చిబౌలి మెయిన్ రోడ్డులో జూన్ 5న ప్రారంభించారు. పండుగ వస్త్రాలు, నవ కల్యాణ వధువును సింగారించే పట్టుచీరలు వైవిధ్యభరిత శ్రేణిలో ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి.

దార్శనికులైన పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి.ప్రసా దరావు, దివంగత పి.సత్యనారాయణ నెలకొల్పిన కాంచిపురం నారాయణి సిల్క్స్ సంప్ర దాయాన్ని ఆధునిక జీవనశైలిని మేళవించిన ఒక సుప్రసిద్ధ బ్రాండ్‌గా రూపుదిద్దుకుంది. సంస్థ చైర్పర్సన్, హోల్ టైమ్-డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గచ్చిబౌలిలో తమ షోరూంను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

ఎండీ సీర్ల రాజమౌళి మాట్లాడుతూ.. సంప్రదాయాన్ని సరికొత్త ఫ్యాషన్‌తో మేళవించడమే తమ ఆశయమని తెలిపారు. సంస్థ హోల్-టైమ్ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ.. కంచిపురం నారాయణి సిలక్స్ అత్యుత్తమ నాణ్యతకు, వారసత్వ సంపదకు, హుందాతనానికి ప్రతీక అని కొనియాడారు. వివాహాది శుభకార్యాలలో నూతన వధువుల్లో లక్ష్మీకళ ఉట్టిపడేలా అలంకరించే కంచిపురం పట్టు చీరలు వస్త్రప్రియులను తప్పకుండా కనువిందు చేస్తాయని అన్నారు.