7 June, 2026 | 1:25 AM

ఉద్యమ టీచర్లకు ఘన సత్కారం

07-06-2026 12:09 AM
  1. ప్రైవేట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం 
  2. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్‌గుప్తా

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సం ఘం ఆధ్వర్యంలో ఉద్యమంలో విశేష సేవలందించిన ఉపాధ్యాయులు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నాగోల్‌లోని ఉప్పల శ్రీనివాస్‌గుప్తా క్యాంపు కార్యా లయంలో ఘన సత్కార సభ నిర్వహించారు.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా హాజరయ్యారు. అతిథులుగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు, తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు.

ప్రైవేట్ టీచర్స్ విభాగం అధ్యక్షులు అజయ్ కార్తీక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో సేవలందించిన పలువురు ఉపాధ్యాయులు, విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలు, అవార్డులతో ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. ప్రైవే ట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలనలో అన్ని వర్గా ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రైవే ట్ ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా ప్రభు త్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

గంధం రాములు మాట్లాడుతూ.. ప్రైవే ట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఐక్యంగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపే తం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర కోశాధికారి చంద్రశేఖర్ ముదిరాజ్, విద్యాశాఖ విభాగం కోఆర్డినేటర్ ముప్పూరి కుమార్, వ్యాయామ ఉపాధ్యాయ విభాగం నాయకులు కిరణ్ కుమార్, నక్క నాగరాజు, మొయిజ్, సుధాకర్, సమదు, చారీ, అక్బర్, మహిళా నాయకులు రేణుక, సంధ్య, శ్వేత, వరలక్ష్మి, షేక్ అమిదా, అమీనా సుల్తానా పాల్గొన్నారు.