12 July, 2026 | 2:01 AM

హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే రాక

12-07-2026 12:00 AM
  1. ఈ నెల15న జరిగే సభను విజయవంతం చేయాలి
  2. ఆర్పీఐ జాతీయ కార్యదర్శి పేరం నాగేశ్వర్‌రావు గౌడ్ పిలుపు

ముషీరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) జాతీయ అధ్యక్షుడు రాందాస్ అథవాలే ఈ నెల 15న హైదరాబాద్కు రానున్న సందర్భంగా నిర్వహించనున్న భారీ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆర్పీఐ(అథవాలే) జాతీయ కార్యదర్శి, ఉమ్మడి రాష్ట్రాల ఇన్చార్జి పేరం నాగేశ్వర్ రావు గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ మేరకు శనివారం  బేగంపేటలోని హరిత ప్లాజాలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే పర్యటన పార్టీకి, సామాజిక న్యాయ ఉద్యమానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, సభ్యత్వ విస్తరణ, రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు చర్చించారు.

జిల్లా స్థాయి నాయకులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఈ  సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్న ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి సతీష్ కుమార్, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సచిన్ గౌడ్, గోరక్ సింగ్, ఉపాధ్యక్షుడు జగన్నాథం, కార్యదర్శులు రాచమల్ల, పోతరాజు, సాంబ కాన్షిరాం, జాయింట్ సెక్రటరీ సుద్దాల అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు. 15న జరిగే సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.