29-04-2025 12:00:00 AM
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ పాన్-ఇండియా ప్రాజెక్ట్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీకౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషించనున్నట్టు టీమ్ ఇటీవలే ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్టులో మరో నటుడు భాగమవుతున్నట్టు మేకర్స్ వెల్లడించారు.
శాండల్‌వుడ్ డైనమో విజయ్‌కుమార్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రను పోషించనున్నట్టు తెలిపారు. కన్నడ చిత్రసీమలో ప్రముఖ నటుడిగా ఎదిగిన విజయ్‌కుమార్‌కు తెలుగులో ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఆయన ఇంతకుముందు ‘వీరసింహారెడ్డి’లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది.