03-05-2025 12:23:07 PM
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్(Banjara Hills) ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురైన 12 ఎకరాల ప్రభుత్వ భూమి(Government land)ని రెవెన్యూ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్ 102/1HAK/1 లో 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి, పెన్సింగ్ పై అధికారులకు పలు సూచనలు చేసి, 12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైన ప్రాంతంలో కూల్చివేసిన ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ భూమిని మంత్రి పొన్నం (Minister Ponnam Prabhakar), మేయర్ గద్వాల విజయలక్ష్మీ పరిశీలించారు. ప్రభుత్వ భూమిని కాపాడిన కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ ను మంత్రి పొన్నం అభినందించారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే అధికారులకు చెప్పాలని మంత్రి కోరారు.