03-05-2025 12:07:01 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల(Rajendranagar Mandal) పరిధిలోని ఎర్రబోడలో విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. బాధిత దంపతులు రమేశ్, రాజేశ్వరి పురుగుల మందు తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి, భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ఎందుకు ఆత్మహత్యాయత్నం కోణంలో దర్యాప్తు చేశారు.