కన్నతండ్రే కాలయముడు
మిస్టరీ వీడిన బాలిక హత్య కేసు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): వావి వరసలు మరిచిన తండ్రి చివరకు కన్నకూతురినే కడతేర్చా డు. మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న పైశాచిక సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట్‌కు చెందిన నరేశ్, శారద దంపతులు మియాపూర్ నడిగడ్డ తండాకు ఈ నెల మొదటి వారంలో వలస వచ్చారు. ఓ డెలివరీ కంపెనీలో పనిచేసే నరేష్ పోర్న్ వీడియోలు చూసేవాడు. తన ఫోన్ డిస్‌ప్లే పనిచేయక ఒత్తిడికి లోనయ్యాడు. అప్పుడే నరేష్ కూతురు ఊరు వెళ్తానని అనడంతో ఇదే అదునుగా భావించిన అతడు బస్టాండులో దింపేందుకు బైక్‌పై తీసుకుని బయలుదేరాడు.
మియాపూర్ మెయిన్‌రోడ్డుపైకి వచ్చాడు. అయితే, బస్టాండ్‌కు కాకుండా బాలికను నడిగడ్డ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. అమ్మకు చెప్తానని గట్టిగా అరవడంతో పరువు పోతుందన్న భయంతో కన్నకూతురనే జాలి కూడా లేకుండా జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు. బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. 11 నిమిషాల్లో ఇదంతా జరిగింది. అనంతరం ఇంటికి వచ్చిన నరేశ్.. మూడు రోజుల పాటు కూతురు మృతదేహాన్ని చూసేందుకు వెళ్లి మళ్లీ ఇంటికొచ్చేవాడు. నాలుగో రోజు భార్యతో కలిసి కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడు రోజుల తర్వాత బాలిక మృతదేహం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగప్రవేశం చేసి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నరేశ్‌ను నిందితుడిగా నిర్ధారించారు. అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకోగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ నరసింహారావు తెలిపారు.






