10-09-2024 12:59:26 AM
స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మల్టీ లింగ్వల్ ప్రాజెక్టు ‘కాంత’. ఈ చిత్రం సోమవారం హై దరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమా లతో లాంఛనంగా ప్రారంభమైంది. చిత్రీకరణను కూడా ప్రారంభించారు. సీనియర్ హీరో వెంకటేశ్ ముహూర్తపు సన్నివేశా నికి క్లాప్‌నిచ్చారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా భాగ్యశ్రీ నటిస్తుండగా, సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో హ్యూమన్ రిలేషన్స్, సోషల్ చైంజెస్‌ను ఎక్స్‌ఫ్లోర్ చేసే గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా ఈ సినిమా ఉండబోతోంది. ప్రశాంత్ పొట్లూరి, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డాని శాంచెజ్ లోపెజ్; సంగీతం: జాను.