7 June, 2026 | 7:08 AM

జనక అయితే గనక దసరాకే

10-09-2024 12:58 AM

సుహాస్, సంగీర్తన హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షితరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ సోమవారం ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రూపొందించిన ఓ వీడియో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీడియోలో నిర్మాత దిల్ రాజు, సుహాస్ సంభాషణలు ఫన్నీగా ఉంటూనే.. రిలీజ్ డేట్ అక్టోబర్ 12 అని రిజిష్టర్ అయ్యేలా ఉంది.