26 May, 2026 | 4:53 PM

Breaking News

బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •  

సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షునిగా కంతి మధు

03-01-2026 12:00 AM

ఆలేరు, జనవరి 2 (విజయక్రాంతి): ఆలేరు మండల సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షునిగా శారాజుపేట గ్రామ సర్పంచ్ కంతి మధును ఏకగ్రీవంగా ఆలేరు మండలం అన్ని గ్రామాల సర్పంచులు అందరూ  కలిసి ఎన్నుకోవడం జరిగింది. అనంతరం మండల సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షులుగా కందిగడ్డ తండా బోరిలాల్ నాయక్‌ను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు మందనపల్లి గ్రామ సర్పంచ్ సిరిమర్తి రేణుక నరసయ్య, సాయిగూడెం గ్యార  కవితసంపత్, పటేల్ గూడెం గ్యార కుమారస్వామి, గొలనుకొండ ఇందూరి యాదిరెడ్డి, మంతపురి పసుల సతీష్ రెడ్డి, కొల్లూరు జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి, బైరాం నగరం సర్పంచ్ కంపరాజు వెంకటేశ్వరరాజు, మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరాజు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్కూరి సురేష్ గౌడ్, కందడి శేఖర్ రెడ్డి, ప్రశాంతు, కమలేష్, యువజన నాయకులు పాల్గొన్నారు.