calender_icon.png 3 January, 2026 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

03-01-2026 12:00:00 AM

కొత్తపల్లి, జనవరి 2 (విజయక్రాంతి): తీగల గుట్టపల్లి లో నక్ష తోవ  కబ్జా చేసి , మట్టి రోడ్డు పనులు జరగకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులు కోలగని అనిల్ అతని తండ్రి లక్ష్మయ్యపై  చట్టపరమైన చర్యలు  తీసుకోవాలని కోరుతూ తీగలగుట్టపల్లి రైతులు కాశెట్టి దామోదర్ ,దాసరి ప్రభాకర్ గాజే నరేష్ ,కొలగాని దివాకర్, దాసరి అనిల్ ,దాసరి అశోక్ వడ్నాల తిరుపతి ,కొట్టే సాయి కిరణ్ ,దాసరి భూపతి, దాసరి గోపయ్య, కాశెట్టి రమేష్ చింతపండు కనకయ్య ,గాజే సంతోష్ ,గాజ సురేష్ తదితర రైతులు  శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 

తీగల గుట్టపల్లి ప్రజల అవసరాలకు  ఉపయోగపడే నక్ష రహదారి కబ్జాకు గురి కావడంతో లోగడ మండల సర్వేయర్ తో సర్వే చేయించి , రోడ్డు కోసం హద్దురాళ్ళు  కూడా ఏర్పాటు చేయడం జరిగిందని  ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం   కరీంనగర్ నగరపాలక సంస్థ ఇక్కడి ప్రాంతంలో మట్టి రహదారిని  ఏర్పాటు చేయడానికి నిధులు కూడా మంజూరు చేసిందని తెలిపారు.

అయితే  కాంగ్రెస్ నేత కొలగని అనిల్, అతని తండ్రి లక్ష్మయ్య మట్టి రోడ్డు నిర్మాణ పనులు జరగకుండా  అడ్డుకుంటున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ ను బెదిరిస్తూ , స్థానిక ప్రజలను, రైతులను దుర్భాషలాడుతూ పనులు జరగకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేత కొలగని అనిల్, అతని తండ్రి లక్ష్మయ్య పై చట్టపరమైన చర్యలు తీసుకొని , నక్షత్రోవ నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని  రైతులు ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.