5 June, 2026 | 1:13 AM

గ్లోబల్ సిటీ దిశగా కరీంనగర్..

05-06-2026 12:00 AM

నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ 

కరీంనగర్, జూన్ 4 (విజయ క్రాంతి): కరీంనగర్ చాలా వేగంగా ఒక గ్లోబల్ సిటీగా మారే దిశగా అడుగులు వేస్తోందని... ఇది తెలంగాణ కే గర్వకారణమని నగర మేయర్ కొలగని శ్రీనివాస్ అన్నారు. బుధ, గురువారాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషి కేష్ లో  జరిగిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117 వ సమావేశంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, సహచర మేయర్లు పాల్గొన్న సమావేశంలో మేయర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదని, ప్రజల జీవితాలను సులభతరం చేయడమన్నారు.  కరీంనగర్, తెలంగాణలోని ఒక ముఖ్యమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని,  దీనిని కేంద్ర ప్రభుత్వ ’స్మార్ట్ సిటీ మిషన్’ కింద ఎంపిక చేసిందన్నారు. కరీంనగర్ను ఒక ఆధునిక నగరంగా మార్చడానికి అనేక పెద్ద మార్పులు జరుగుతున్నాయన్నారు నగరంలో స్మార్ట్ రోడ్లు, మంచి ఫుట్పాత్లు, డ్రైనేజీలు,  నగరం మొత్తంలో సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భద్రతను పెంచడానికి అనేక కార్యక్రమాలుజరుగుతున్నాయన్నారు. 

ప్రధానంగా  కరీంనగర్లో స్వచ్ఛమైన నీరు, మంచి డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన రోడ్లు,  అందమైన పార్కులను నిర్మించి ప్రజలకు ఒక మెరుగైన వాతావరణాన్ని అందించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావనంతరం ప్రప్రథమంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను బిజెపి కైవసం చేసుకుందని, ఇది తెలంగాణలో నే బీజేపీకి ఒక చారిత్రక విజయం లాంటిదని మేయర్ కొలగాని శ్రీనివాస్ వివరించారు.