calender_icon.png 23 July, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ హక్కుల కమిషన్ సదస్సు విజయవంతం

22-07-2025 07:02:01 PM

నిర్మల్ (విజయక్రాంతి): జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission) సమావేశం నిర్మల్ పట్టణంలోని టిఎన్జిఓ భవనంలో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జాతీయ చైర్మన్ డాక్టర్ ఎంపీ రాజేష్ కన్నా మాట్లాడుతూ.. దేశ పౌరులకు ఉన్న హక్కుల గురించి తెలిపారు. మన హక్కుల కొరకు నిరంతరం రాజ్యాంగబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరునికి సాధారణంగా కొన్ని సెక్షన్లు తెలిసి ఉండాలని హితవుపలికారు. అనంతరం నయర్ కూరల్ తెలుగు మాస పత్రికను ప్రారంభించారు. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ లోగోను ప్రారంభించారు. ఇందులో జాతీయ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సాహిల్ ఖాన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరి, నూర్జహన్, షాబోద్దీన్, సోఫి ఇమ్రాన్, సోఫి ఇల్యాస్, షరీఫ్ బిన్ హాది, ఇసాక్ అలీ, ఇర్ఫాన్, షాకీర్, ఇంతియాజ్ అలీ తదితరులు ఉన్నారు.