24 August, 2026 | 1:52 AM

క్రికెట్‌కు కర్ణ్‌శర్మ వీడ్కోలు

24-08-2026 12:12 AM

ముంబై, ఆగస్టు 23: టీమిండియా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ, భారత దేశవాళీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల కర్ణ్ శర్మ.. యూపీ టీ20 లీగ్లో కాన్పూర్ సూపర్స్టార్స్, మీరట్ మావెరిక్స్ మ్యాచ్ అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఆగస్టు 25న లఖ్నవూ లెగ్ జట్టు ఆడే చివరి మ్యాచ్తో ఆటగాడిగా కెరీర్కు పూర్తిగా ముగింపు పలకనున్నాడు.

తన ప్రయాణంలో అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, బీసీసీఐ, రైల్వేస్, యూపీసీఏ, ఆంధ్ర, విదర్భ క్రికెట్ అసోసియేషన్తో పాటు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఇకపై క్రికెట్కు సంబంధించిన కోచింగ్, ఇతర బాధ్యతలకు అందుబాటులో ఉంటానని కర్ణ్ శర్మ తెలిపాడు.

దేశవాళీ, ఐపీఎల్ ప్రదర్శనలతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన కర్ణ్.. 2014 ఇంగ్లండ్ పర్యటనకు భారత పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్కడే టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది శ్రీలంక పర్యటనలో వన్డే అరంగేట్రం చేశాడు.2015లో జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ భారత జాతీయ జట్టులోకి రాలేకపోయా డు. దేశవాళీ క్రికెట్లోనూ కర్ణ్ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.చివరి ఐపీఎల్ మ్యాచ్ 2025లో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు.