ఆధ్యాత్మికవేత్త పెద్ద మహాత్మ భూమి కొండేశ్వర్
ఎమ్మెల్యే మాణిక్యరావు
జహీరాబాద్ ఆగస్టు 23: మహాత్మ భూమి కొండేశ్వర్ ఆధ్యాత్మికవేత్త అని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అన్నారు. ఆదివారం నాడు న్యాల్కల్ మండలము కల్ విమల్ మహాత్మ భూమి కొండేశ్వర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం కోసం, భక్తి భావన కోసం భూమి కొండేశ్వర్ ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. కురుమల ఆత్మబంధువుగా కొలువబడుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్, ఝరాసంగం టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,వెంకటేశం టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు విజయకుమార్, సత్యం ముదిరాజ్, నరసింహారెడ్డి, రాజేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ప్రవీణ్, రవి కుమార్ ,మారుతి ,వినోద్ ,మల్ రెడ్డి ,పీటర్, ఇమ్రాన్, చంద్రు ,శివకుమార్ ,మహిపాల్ ,బి శంకర్ ,మారుతి పాటేల్, చంద్రప్ప ,శివన్న, నవీన్, నగేష్, మారుతి, గణేష్ తదితరులు పాల్గొన్నారు






