calender_icon.png 8 October, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జున 100వ చిత్రం టైటిల్ ఇదే!

07-10-2025 12:00:00 AM

అక్కినేని నాగార్జున ఇటీవల విడుదలైన ‘కుబేర’, ‘కూలి’ చిత్రాల్లో తన నటనతో మెప్పించారాయ. ఈ టాలీవుడ్ కింగ్ కెరీర్‌లో ఇప్పుడొక ప్రత్యేక మైలురాయిని చేరుకుంది. అదే ‘కింగ్100’. అంటే నాగార్జున తన వందో సినిమాను పట్టాలెక్కిం చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టు గురించి ఆసక్తికర వార్తలు కొంతకాలంగా వినవస్తున్నాయి.

తనకు కలిసివచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కథను ఓకే చేసిన కింగ్ నాగార్జున ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను తమిళ్ డైరెక్టర్ రా.కార్తీక్‌కు అప్పగించారు. కథకు తగ్గట్టుగానే ఇందులో నాగ్ సరసన ఏకంగా ముగ్గరు భామలు ఆడిపాడనున్నారని టాక్. తాజాగా ఈ మూవీ టైటిల్ గురించి పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం.

ఈ చిత్రంలో అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ కూడా కనిపించబోతున్నారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. అయితే, అవి ప్రత్యేక అతిథి పాత్రలా.. క్యామియో రోల్సా? తెలియాల్సి ఉంది. మరోవైపు, కింగ్100 ముహూర్తం దసరా రోజున చేశారు..

ఇదిగో పూజా ఫొటోలు అంటూ కొందరు సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నారు. అవన్నీ ఫేక్ అని కొట్టిపారేస్తూ దీపావళి లక్ష్మిపూజతో ఈ సినిమా ప్రారంభం కానుందని మరికొందరు చెప్తున్నారు. మరి ఈ వార్తలు నిజమా..? అసలు ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఏ దశలో ఉంది..? అనేది అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే.