05-11-2025 12:59:31 AM
లోపాయికారి ఒప్పందాలతో విసిగిన ప్రజలు
కుమ్మక్కు రాజకీయాలంటూ రోజు ఇల్లెక్కి కూసే కోడిలా పార్టీలు, ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణమైన వేళ.. ప్రజలు సందిగ్ధతకు, ఒకింత అసహనానికి లోనవుతున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిందిపోయి పార్టీలు పొద్దున లేచింది మొదలు.. కుమ్మక్కు అంటూ ఎదుటి పక్షాన్ని ఎండగట్టాలనుకోవడం ఎన్నాళ్లని ప్రజలు విసుక్కోక మానరు. రాష్ట్రవ్యాప్తంగా అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే, అధికార పార్టీ మాత్రం లోపాయికారి ఒప్పందాల పేరిట ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ స్థాయిలో అనేక పార్టీలున్న నేపథ్యంలో ఎన్నికల సందర్భంలో తరచూ పొత్తులు, కూటముల గురించి చర్చ జరుగుతుంది. అయితే ఆయా రాజకీయ పార్టీలన్నీ అవసరాన్ని, సందర్భాన్ని బట్టి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, కూటమిగా ఏర్పడటం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ బహిరంగంగా ప్రకటించి.. పొత్తులు, కూటములను ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, లోపాయికారిగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మరొక ఎత్తుగడ. అయితే ఎన్నికల సమరంలో పోటీ పేరుతో లోలోపల చేతులు కలపడంపై అనైతికం అని, ఇది ఒకరకంగా ఓటర్లను వంచించడమేనన్న విమర్శలు కొత్తకాదు.
కుమ్మక్కు రాజకీయాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారిందనడంలో అతిశయోక్తిలేదు. అసలు ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఎన్నికల సందర్భంగా ఎవరు ఎవరికి లోపాయికారిగా సహకరిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంటున్నది. దీంతో ప్రజల్లో సందిగ్ధత, గందరగోళం తలెత్తుతున్నది. వాస్తవానికి పొత్తులు, కూటముల ఏర్పాటు ఎన్నికల ఫలితంపై తీవ్ర ప్రభావం చూపు తుంటాయి. అందుకే రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా లోపాయికారీ ఒప్పందాల ప్రస్తావన తెరపైకి వస్తుంటుంది.
ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు కుమ్మక్కు పాట ఎత్తుకోవడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ కుమ్మక్కు రాజకీయాలు అటు తిరిగి, ఇటు తిరిగి 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్యూహ పరిణామాలకు దారితీయవచ్చు. అయితే లోపాయికారీ ఒప్పందాల విషయంలో ఆయా పార్టీలు వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతును కూడగట్టుకునేందుకు, బీఆర్‌ఎస్ తిరిగి పుంజుకునేందుకు, బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఎదుటి పార్టీని ఈ కుమ్మక్కుతోనే దెబ్బకొట్టాలని చూస్తున్నాయి.
ఎంపీ ఎన్నికల సమయంలో..
తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ హయాంలో లోపాయికారీ ఒప్పందాలపై తరచూ చర్చ జరిగేది. అయితే ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీకి బీఆర్‌ఎస్ సహకరించిందని తీవ్రమైన ఆరోపణలు వినిపించాయి. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చింది. దీనికితోడు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఫలితంగా బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారి ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలువలేకపోయింది.
ఇదిలా ఉండగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోగా, అప్పటికే 4 సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో ఉన్న బీజేపీ ఏకంగా 8 స్థానాల్లో గెలిచింది. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి లోపాయికారీగా సహకరించిందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరింది. దీంతోపాటు బీఆర్‌ఎస్ కీలక నియోజక వర్గాల్లో బలహీన అభ్యర్థులను నిలబెట్టి, బీజేపీకి గెలుపు సులభం అయ్యేలా చేసిందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపించాయి. ఇవన్నీ రాజకీయపరమైన ఆరో పణలని బీఆర్‌ఎస్ ఖండించినా, ఆ సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ తమ ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడంతో బీజేపీకి పరోక్ష లాభం కలిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
జూబ్లీహిల్స్‌లోనూ అదే వాదన..
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎంఐఎం పార్టీ అధికార పార్టీకి మిత్ర పక్షంగానే వ్యవహరించింది. అయితే నేరుగా పొత్తులు పెట్టుకోకపోయినా హైదరాబాద్ పరిధిలోని ఎంఐఎం పటిష్టంగా ఉన్న ని యోజకవర్గాల్లో నామమాత్రంగానే పోటీ చేసింది. ఎంఐఎం కూడా ఇతర ప్రాంతా ల్లో, పట్టణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ గెలుపునకు సహకరించింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న సంబంధా లపై చర్చ మళ్లీ వేడెక్కింది. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్, ఎంఐఎం మైత్రి చెడిపోయిందని స్పష్టమైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నూ ఎంఐఎం తరఫున అభ్యర్థిని కూడా బరిలో నిలుపలేదు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం అధినేత, ఎం పీ అసదుద్దీన్ ఓవైసీ మద్దతు కూడా ప్రకటించారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్, ఎంఐ ఎం లోపాయికారి ఒప్పందంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాదులో ఎంఐఎం పార్టీకి మైనారిటీ ఓటర్లలో గట్టి పట్టు ఉంది. మరోవైపు బీఆర్‌ఎస్ గత పదేళ్ల పాలనలో పాత నగర ప్రాంతాల్లో ఎంఐఎంతో సమన్వయం చేసుకుంటూ సాగింది. ఈ క్రమంలో ఎంఐఎం బహిరంగంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపినప్పటికీ లోపాయికారీగా బీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటించిన ఎంఐఎం పైనే షబ్బీర్ అలీ వంటి సీనియర్ నాయకులు ఆరోపణలు చేయ డం ఇప్పుడు ఆసక్తికరంగా మారడంతోపాటు బీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య లోపా యికారీ ఒప్పందం ఉందనే వాదనకు ఊతమిస్తుంది. లోపాయికారీ ఒప్పందాల ఆరోపణలను పక్కన పెడితే ఎంఐఎం మద్దతు ఉన్న మైనారిటీ ఓటర్లు బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ పరిణామం కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజా సమస్యలపై పట్టింపేదీ..
కుమ్మక్కు రాజకీయాలంటూ రోజు ఇల్లెక్కి కూసే కోడిలా పార్టీలు, ఒకదానిపై ఒకటి ఆరోపణనలు చేసుకోవడం సర్వసాధారణమైన వేళ.. ప్రజలు సందిగ్ధతకు, ఒకింత అసహనానికి లోనవుతున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిందిపోయి రాజకీయ పార్టీలు పొద్దున లేచింది మొదలు కుమ్మక్కు అంటూ ఎదుటి పక్షాన్ని ఎండగట్టాలనుకోవడం ఎన్నాళ్లని ప్రజలు విసు క్కోక మానరు. ఎన్నికల సమయంలో పా లకులు ప్రస్తావించే అంశాల్లో ప్రజా సమస్యల పట్ల పట్టింపే లేకుండా పోతుంది.
రాష్ట్రవ్యాప్తంగా అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే, అధికార పార్టీ మాత్రం లోపాయికారీ ఒప్పందాల పేరిట ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నదని ప్రజలు అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రజలు కోరుకునేదేమిటి?.. పాలకులు చేస్తున్నదేమిటి? అని ప్రశ్నిస్తు న్నారు. హామీల అ మలు, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగడంపైనే సమ యం వెచ్చించడం ఏమిటని పెదవి విరుస్తున్నారు. పార్టీలు కేవలం గెలుపుపైనే దృష్టి సారించకుండా ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రజలు ఆశిస్తున్నారు.
కుమ్మక్కు రాజకీయాలంటూ రోజు ఇల్లెక్కి కూసే కోడిలా పార్టీలు, ఒకదానిపై ఒకటి ఆరోపణనలు చేసుకోవడం సర్వసాధారణమైన వేళ.. ప్రజలు సందిగ్ధతకు, ఒకింత అసహనానికి లోనవుతున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిందిపోయి రాజకీయ పార్టీలు పొద్దున లేచింది మొదలు కుమ్మక్కు అంటూ ఎదుటి పక్షాన్ని ఎండగట్టాలనుకోవడం ఎన్నాళ్లని ప్రజలు విసుక్కోక మానరు. ఎన్నికల సమయంలో పాలకులు ప్రస్తావించే అంశాల్లో ప్రజా సమస్యల పట్ల పట్టింపే లేకుండా పోతుంది.