05-11-2025 09:03:06 AM
గవర్నర్, మేయర్ ఎన్నికల్లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఓటమి.
డెమొక్రాట్లు కీలక విజయాలు.
ఆర్థిక ఇబ్బందులు ట్రంప్ రిపబ్లికన్ పార్టీపై తీవ్ర ప్రభావం.
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విధానాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్, మేయర్ ఎన్నికల్లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఓటమి చవిచూసింది. వర్జీనియా గవర్నర్ గా డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్ బర్గర్(Abigail Spanberger) విజయం సాధించారు. వర్జీనియా తొలి మహిళా గవర్నర్ గా అబిగైల్ స్పాన్ బర్గర్ రికార్డు విజయం సొంతం చేసుకున్నారు. సిన్సినాటి మేయర్ గా డెమొక్రాట్ అభ్యర్థి అఫ్తాబ్ పురేవాల్(Aftab Pureval) గెలుపొందారు. సిన్సివాటి మేయర్ ఎన్నికల్లో జేడీ వాన్స్ సమీప బంధువు ఓటమి చవిచూడాడు. అట్లాంటా మేయర్ గా డెమొక్రాట్ అభ్యర్థి ఆంఢ్రీ డికెన్స్(Atlanta Mayor Andre Dickens) తిరిగి ఎన్నికయ్యారు. పిట్స్ బర్గ్ మేయర్ రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కోరీ ఓకానర్(Corey O’Connor) విజయం సాధించారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారతీయ మూలాలున్న మమ్ దానీ(Zohran Mamdani) విజయం సాధించారు. న్యూయార్క్ మేయర్(New York Mayor)గా వామపక్ష నేత మమ్ దానీ ఎన్నికయ్యారు.