05-11-2025 08:17:50 AM
ముత్తారంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో ఎస్ఐ రవికుమార్
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఎస్సై రవికుమార్ అన్నారు. మండల కేంద్రాల్లోని అడవి శ్రీరాంపూర్ చౌరస్తా వద్ద దాతల సహకారంతో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. వివిధ ప్రాంతల నుండి గుర్తు తెలియని వ్యక్తులు మండలంలోకి వచ్చి ఎవరు లేని ఇండ్లల్లో, షాపులలో, రోడ్ల పై వెళ్ళుతున్న ఆడవారి మేడలోనుండి బంగారపు అభరణాలు దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఇక నేరాల నియoత్రణ కొరకు, ప్రజల భద్రత దృశ్య ముందస్తు చర్యగా మండల కేంద్రంలోని అడవి శ్రీరాంపూర్ చౌరస్తాలో స్తానిక షాప్ ల యాజమాన్యం వారి సహకారంతో 4 సిసి కెమెరాలను కమ్యూనిటీ పోలీసింగ్ క్రింద ఏర్పాటు చేశామని ఎస్ఐ తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో షాపు యాజమాన్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.